రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్న విశాఖ కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు జలశక్తి అవార్డులను స్వీకరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అధికారులు మంగళవారం ఢిల్లీలో అవార్డులను స్వీకరించారు. మూడు విభాగాల్లో ఐదు అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. ఉత్తమ జిల్లాగా విశాఖపట్టణం ఎంపికైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.