సీజనల్ వ్యాదులయిన డెంగ్యూ, అతిసార వ్యాధుల పై అప్రమత్తం గా ఉండాలని దేవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి
ఎం.శ్రీనివాసరావు సూచించారు. స్టాప్ డయేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, మరియు డెంగ్యూ నియంత్రణ మాసోత్సవములలో భాగముగా దేశపాత్రునిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం డెంగ్యూ, అతిసార వ్యాధులపై అవగాహన కలిగించడం జరిగినది. అతిసార వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి సూచించడం జరిగినది.