ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) యలమంచిలి జోన్ సమావేశం, కేకేఎల్ఎన్ ధర్మారావు అధ్యక్షతన, యలమంచిలి ఉషోదయ కాలేజీలో నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి వెంకటపతి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలపై మాట్లాడారు. 117 రద్దు, మధ్యంతర భృతి ప్రకటించడం, తెలుగు-ఆంగ్ల మాధ్యమాల్లో బోధనా అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.