విద్యార్థినులు, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో యలమంచిలి పట్టణంలో బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రమణ మాట్లాడుతూ రోజురోజుకు రాష్ట్రంలో మహిళలు, విద్యార్థుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.