విశాఖ నగరంలో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్లో కిలో 80 రూపాయలు పైగానే ధర పలుకుతుంది. రైతు బజార్లో కిలో 66 రూపాయలకు విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాలు రైతు బజార్లో విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇటీవల వరదలు నేపథ్యంలో టమాట దిగుమతి కావడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు టమాటాలను నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.