పండుగ సీజన్లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-విజయవాడ మధ్య జనసాధరణ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. విశాఖ-విజయవాడ జనసాధరణ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు విశాఖ నుంచి నవంబర్ 1, 3, 4, 6, 8, 10, 11, 13వ తేదీల్లో అలాగే నవంబర్-24వ తేదీ నడవనుంది. తిరుగు దిశలో విజయవాడ- విశాఖపట్నం రైలు విజయవాడలో 1, 3, 4, 6, 8, 10, 11 , 13వ తేదీల్లో నడవనుంది.