ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర పథకంలో చేపట్టిన గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న గృహాల ప్రగతిపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ ను సమీక్షించారు. అధికారులు నిరంతరం నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి కాంట్రాక్టర్లు సంబంధిత ఉద్యోగులతో సమీక్షించాలన్నారు.