జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. ఈ కౌంటర్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన వినతులు ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నేరుగా చేరుకునేందుకు వీలుగా ఈ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.