గ్రామ, వార్డు వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. రంపచోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల ముందు ఉమ్మడి ప్రభుత్వ నాయకులు తమకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. వాలంటీర్లను తొలగించడంతో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయని అన్నారు.