రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాల అమ్మవారి జాతర గురువారం కన్నుల పండుగగా జరిగింది. పిలచిన వెంటనే పలికి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన ఈ అమ్మవారిని స్థానికులే కాకుండా సమీప గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించి పసుపు కుంకుమలను నివేదించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. నిర్వాహకులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.