పెందుర్తి నియోజకవర్గం పరిధిలో బొగ్గు, యాష్ తో తిరుగుతున్న లారీల కారణంగా పలు గ్రామాలు కాలుష్యానికి గురవుతున్నాయని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలు అనధికారికంగా రసాయనక వ్యర్థ జలాలు వదులుతున్న కారణంగా భూగర్భ జలాలన్నీ కలుషితం అయ్యాయని అన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి, స్వయంభూవరం గ్రామాలను అక్కడి నుంచి తరలించాలని కోరారు.