దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం 'ఎక్స్'లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5, 17, 383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 41. 17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.