డిసెంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, ఉత్సవాలను నిర్వహించాలని పేర్కొన్నారు.