వసతి గృహాలను తనిఖీ చేసిన న్యాయమూర్తి

68பார்த்தது
సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ శనివారం నర్సీపట్నంలో పలు విద్యార్థుల వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడితే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி