ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో గురువారం భారత స్వతంత్ర సమరయోధుడు ఆదివాసి పోరాటవీరుడు బిర్షా ముండా 150వ జయంతి వేడుకలను చరిత్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బిర్షా ముండ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కేశవరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో ఆదివాసి యోధుడు బిర్షాముండా పోరాటం మరువలేనిదన్నారు.