విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు హెచ్చరించారు. గాజువాక మండలం వడ్లపూడి గ్రామంలో ఆదివారం సిపిఎం స్టీల్ జోన్ మహాసభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల కాలంలో స్టిల్ ప్లాంట్ ఉద్యమాన్ని సిపిఎం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిందన్నారు.