విశాఖలోని లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారణ అనంతరం బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో రెండో ఏసీఎంఎం కోర్టు నిందితులకు డిసెంబర్ 2వరకు రిమాండ్ విధించింది. లా విద్యార్థినిని ప్రేమ పేరుతో యువకుడు లొంగదీసుకుని ఆపై తన ముగ్గురు స్నేహితులతో వీడియోలు తీసి బెదిరించారు. ప్రియుడు స్నేహితులు ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు.