విశాఖ నగరం బీచ్ రోడ్డులో నేవీకి చెందిన యుహెచ్ 3హెచ్ హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సుమారు 17 సంవత్సరాలు సేవలందించిన ఈ హెలికాప్టర్ కు భారత నౌకా దళం వీడ్కోలు పలికింది. దీనిని టీయూ 142 నేవీ మ్యూజియంకు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది విశాఖ టూరిజానికి మణిహారంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.