త్వరలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం : ఎమ్మెల్యే రాజు

73பார்த்தது
చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలోని గర్ణికం ఫంక్టన్ హాల్ లో శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాజన కొండనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి చోడవరం శాసన సభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడుతూ కూటమి తరపున శాసనసభ్యులుగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 8600 మెజారిటీ రావికమతం మండలంలో తీసుకువచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు రాజనకొండ నాయుడుకు, కార్యకర్తలకు, నాయకులకు, కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు చూశానని పదవీకాలంలో నన్ను కలిసిన వారి కంటే నాకు పదవి లేనప్పుడు కలిసిన వారికి నేనెప్పుడూ అండగా ఉంటానని వారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అని అన్నారు. పార్టీ కోసం పోరాడే కార్యకర్తలకు అండగా ఉంటానని మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తానని మీ గ్రామానికి వచ్చి దళితవాడలో నిద్రిస్తానని అన్నారు. ఆర్భాటాలు వద్దని కక్ష సాధింపులు అసలే మనకు వద్దని గ్రామంలో ప్రతి ఇంటి కి వెళ్లి వారి వివరాలను తీసుకోని వారి యొక్క సమస్యల్లో పాలుపంచుకొని వాళ్లకి అండగా ఉందామన్నారు. ఏ కార్యక్రమాలు చేసిన ఎన్డీఏ కూటమి మిత్రులను కలుపుకొని వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలకు సూచించారు.

தொடர்புடைய செய்தி