అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతగిరి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ కుమార్ పంచాయితీ కార్యదర్శులకు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలు ద్వారా ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ సర్వే పై కార్యదర్శులు సచివాలయం సిబ్బంది దృష్టి పెట్టీ ప్రతి గ్రామంలో ఇంటింటా జియో ట్యాగింగ్ చేయాలని చూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సమావేశంలో ఆదేశించారు.