ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగత్తలపై ప్రజలను అప్రమత్తం చేయుటకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్. డి. ఆర్. ఎఫ్) 10వ బెటాలియన్ టీం కమాండర్ వై. సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కొండకర్ల వద్ద మంగళవారం అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు.