హైదరాబాద్లో గిరిజన విద్యార్థిని అనుమానస్పదంగా మృతిచెందింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారాం బాగ్లో ఓ కన్సల్టెన్సీ ఆఫీస్లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య (20) అనే లా విద్యార్థిని ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ.. పీఎస్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు, మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. శ్రావ్య మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.