సూర్యాపేట: ఐఏఎల్ జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలి

జిల్లా కేంద్రంలో ఐఏఎల్ జరుగుతున్న రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని న్యాయవాదుల సంఘం నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులకు నూతన చట్టాలపై అవగాహన సదస్సులో మాట్లాడారు. న్యాయవాదులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు మహాసభలో తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி