సూర్యాపేట జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ
పారిశ్రామికవేత్త, సుధాకర్ గ్రూప్స్ అధినేత మీలా మహదేవ్ అన్నారు. ప్రజలందరికి అందుబాటులోకి ఉండేలా నూతన భవనంలోకి మార్చిన ఎం. జి. రోడ్ యూనియన్ బ్యాంకు బ్రాంచిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎ. హనుమంతరెడ్డి, ఎజీఎంలు టి. సర్వేష్, ఎన్. సుధాకర్‌రావు ఉన్నారు.