పెద్దపల్లి: మెరుగైన ఫలితాల సాధనకు ప్రణాళిక: కలెక్టర్

10వ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొని ఎల్ఐపి అమలు, పదవ తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி