ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఢిల్లీకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ షఫాలీ నాగ్‌పాల్ ఈ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ఆమె భూతంలా మేకప్ వేసుకుని వీధుల్లో చెక్కర్లు కొట్టింది. రక్తం మరకలు ఉన్నట్టు రంగులు వేసున్న తెల్లని స్లీవ్‌లెస్ డ్రెస్‌ను ధరించి ఆమె వీధుల్లో నడిచింది. ముఖంపై కూడా రక్తం కారుతున్నట్టు మేకప్ వేసుకుంది. వీధిలో మెల్లగా నడుస్తూ జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది.