తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి అన్నట్లుగా.. కేసీఆర్ బాటలోనే రేవంత్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేదు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుచేయలేదు' అని మండిపడ్డారు.