తన పదవి ఐదేళ్లే అని రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే ఆయన యత్నం. ఇవాళ కొడంగల్ తిరగబడింది.. రేపు తెలంగాణ తిరగబడుతుంది. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు. కేసులెన్ని పెట్టినా BRS కార్యకర్తలు భయపడొద్దు. ఎకరం రూ.60 లక్షల భూమిని రూ.10 లక్షలకు గుంజుకునే యత్నం జరుగుతోంది. రేవంత్ చేతనైతే మాతో కొట్లాడాలి. అమాయకులతో కాదు' అని అన్నారు.