BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఘటనలో కేటీఆర్ ఉన్నట్లు తన పార్టీ నాయకులే అంటున్నారని చెప్పారు. సింపతీ కోసమే కేటీఆర్ పదే పదే అరెస్టు మాట అంటున్నాడని విమర్శించారు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి తాము ఏమి కుట్ర చేయడం లేదన్నారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.