ధ్యానంతో మానసిక ప్రశాంతత: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సమకూరుతాయని ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని హుడా రింగ్టన్ కాలనీలోని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ రాజయోగం యోగా కేంద్రం ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కాసేపు ధ్యానం చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ సుష్మ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி