మంచిర్యాల: రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి

జాతీయ రహదారి 63 విస్తరణలో భాగంగా భూములు కోల్పోయే లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కోరారు. ఈ మేరకు మంగళవారం బాధిత రైతులతో కలెక్టర్ ను కలిశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయారని, మళ్లీ జాతీయ రహదారి నిర్మాణానికి భూములు ఇస్తే రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி