కాసిపేట మండలం సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో చేపట్టిన 50 రోజుల ఉపవాస దీక్షల సభ గురువారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. ఉపవాస దీక్ష ముగించి పాస్టర్ ప్రవీణ్ ప్రసంగించారు. క్రైస్తవులను ఆశీర్వదించారు. దేశశాంతి కోసమే ఉపవాస దీక్షలు చేపడుతున్నట్లు కల్వరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి క్రైస్తవులు పాల్గొన్నారు.