బెల్లంపల్లి: దివ్యాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించండి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన ఎలిగేటి తిరుపతి తన డిగ్రీ పూర్తి అయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ అవకాశం రాలేదన్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటలో ఉద్యోగం ఇప్పిస్తామని నాయకులు మాట తప్పారన్నారు. దివ్యాంగులపై చిన్న చూపు ఎందుకని సోమవారం ప్రశ్నించారు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி