భద్రాచలం: ప్రమాద ఘటనపై కేసు నమోదు

భద్రాచలంలో శుక్రవారం రాత్రి రామాలయానికి చెందిన శ్రీరామసదనం సత్రం మొదటి అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన వి. రామకృష్ణన్(63) మృతిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. చెన్నై నుంచి వచ్చిన రామకృష్ణన్ భార్య కామిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని వారికి అప్పగించారు. దైవ దర్శనానికి వచ్చిన ఆయన ప్రమాద ఘటనలో మృతి చెందారు.

தொடர்புடைய செய்தி