ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని సోమవారం రాత్రి హౌస్ అరెస్ట్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న పలు మండలాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. రెబ్బెన మండల నాయకులు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ నివాసానికి బయలుదేరగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు.