జైనూర్: బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆత్రం సుగుణక్క

జైనూర్ మండలం రాంనగర్ గ్రామానికి చెందిన పవార్ భీమ్ రావు నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ఆత్రం సుగుణక్క, డిసిసి అధ్యక్షులు విశ్వ ప్రసాద్ రావులు గురువారం ఆయన నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி