ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఇటివల జువ్వాడి నర్సింగరావు పర్యటించగా రహదారి సరిగాలేక వర్షానికి కొట్టుకపోయి గుంతలుగా అయ్యిందని దానిని మరమ్మత్తులు చేయించాలని గ్రామస్థులు కోరారు. వెంటనే జువ్వాడి నర్సింగరావు స్పందించి రుపాయలు లక్ష యాబై వేలు మంజూరు చేయగా శనివారం ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో ప్రౌసిడీంగ్ పత్రాలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందచేశారు.