చీర్స్ అనే పదం చియర్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఆనందం అని. పూర్వం దొంగలు దొంగతనం అనంతరం మద్యం తాగేవారు. వారిలో కొందరు దొంగతనం చేసిన మొత్తాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం మిగతావారి గ్లాసుల్లో విషం కలిపేవారట. చీర్స్ కొట్టే సమయంలో ఒకరి గ్లాసులోని విషం మరొకరి గ్లాసులో పడితే అందరూ చనిపోతారని భయపడి ఎవ్వరూ విషం కలపకుండా ఉండేవారు. అది కాస్త కాలక్రమంగా దేశ విదేశాలకు వ్యాపించింది.