మొబైల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్ దుకాణదారుడి కళ్లలో కారం చల్లి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు మొబైల్ షాపులోకి వచ్చిన దుండగుడు రూ.13,570 విలువైన ఫోన్ను కొనుగోలు చేశాడు. ఆన్లైన్ పేమెంట్ చేస్తానని చెప్పి ఫోన్ తీయడానికి జేబులో చేయి పెట్టాడు. అనంతరం జేబులోంచి కారం పొడి తీసి దుకాణదారుడి కళ్లలోకి విసిరి పారిపోయాడు.