ఖమ్మం జిల్లా దానవాయిగూడెం సాంఘీక సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం దానవాయిగూడెంలో సంక్షేమ హాస్టల్ ను సందర్శించి డైనింగ్ టేబుల్స్, కుర్చీలను అందజేసి మాట్లాడారు. గడిచిన వరదల సమయంలో రెసిడెన్షియల్ పాఠశాల మునగడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ తో సమన్వయం చేసుకుంటూ వరద ప్రభావిత చర్యలు తీసుకున్నామని చెప్పారు.