ఓ హోటల్లో ఆర్డర్ చేసిన పిజ్జాలో పురుగులు కలకలం రేపాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షాహ్దోల్లో చోటు చేసుకుంది.
రోహన్ బర్మాన్ అనే యువకుడు ఓ హోటల్లో పిజ్జా ఆర్డర్ చేశాడు. వేడివేడిగా పిజ్జా తినేందుకు బాక్స్ ఓపెన్ చేసి చూడగా పిజ్జాలో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి. ఈ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.