LIC జీవన్ ఉత్సవ్ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు. ఆపై ఎంత మొత్తమైనా హామీ మొత్తంగా ఎంచుకోవచ్చు. 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్ ఎంచుకుంటే ఏటా రూ.2.17 లక్షలు, 8 ఏళ్ల ప్రీమియం ఎంచుకుంటే రూ.1.43 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.58 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం వ్యవధి పెరిగితే చెల్లించాల్సిన మొత్తం తగ్గుతుంది.