ఎస్ కోట: పిహెచ్సి భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి

ఎస్. కోట నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పీహెచ్సీల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభాపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ కోట, అలమండ, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. తద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందడం లేదని అన్నారు.

தொடர்புடைய செய்தி