ఉరవకొండ నూతన పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించండి: ఎమ్మెల్సీ

ఉరవకొండ స్థానిక అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో కొత్తవి మంజూరుకు అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితను మంగళవారం కోరారు. ఉరవకొండ అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లను ఒకే భవనంలో నిర్వహించడం కష్టతరంగా మారిందని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా పూర్తి శిథిలావస్థకు చేరిందని హోమ్ మంత్రి అనిత, డీజీపీకి వివరించారు.

தொடர்புடைய செய்தி