పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో మంత్రి సవితమ్మ సూచనల మేరకు, టిడిపి నాయకులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులతో కలిసి కాలనీలో మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. కాలనీ వాసులు సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్స్ అవసరం ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీరాములు, రమణమ్మ, త్రివేంద్ర తదితరులు పాల్గొన్నారు.