విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు మృతి

పామిడిలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన రవి (25) అనే భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. ఓ పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో మంగళవారం రవి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி