పొన్నూరు పట్టణం 5వ వార్డులో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రూ. 4 వేల పెన్షన్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఒక్కరోజే నూరు శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్ రమేష్ బాబు ఆదేశించారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.