అద్దంకి: వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన ఢిల్లీ బృందం

అద్దంకి మండలం గోవాడ గ్రామంలో నరిశెట్టి రమేష్ బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం ఏపీ సిఎన్ఎఫ్ అధికారిణి దుర్గ, ఢిల్లీ ప్రకృతి వ్యవసాయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, బీజామృతం తయారీ విధానం గురించి ఆమె నిర్వాహకులు రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తుల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని లక్ష్మీ దుర్గ తెలిపారు.

தொடர்புடைய செய்தி