శీతాకాలంలో చలి వేయడం సహజం. అయితే కొంతమంది చిన్నపాటి చలిని కూడా తట్టుకోలేరు. ఎక్కువగా వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే.. శరీరం అధికంగా ఐరన్, విటమిన్ B12, విటమిన్ C, ఫోలేట్ వంటి పోషకాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ పోషకాలు తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆక్సిజన్ రవాణాను చేస్తేనే శరీరం వెచ్చగా ఉంటుంది. వీటిలో ఏదైనా లోపిస్తే శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. అందువల్ల తీవ్రమైన చలివేయడం వంటివి జరుగుతాయి.