అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు సమృద్దిగా లభించాలంటే అవి తినే సమయం ప్రధానం అంటున్నారు ఆహార నిపుణులు. అరటిపండ్లను పగటిపూట ఎప్పుడైనా తినవచ్చు కానీ రాత్రిపూట మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి అరటిపండును రాత్రి సమయంలో తినకూడదు. అయితే ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు. అరటిపండ్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. దీని కారణంగా అరటిపండ్లను ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి రావడానికి కారణం అవుతుంది.